ఐటీఐలో ప్రవేశానికి 19 వరకూ అవకాశం
ABN, First Publish Date - 2023-06-11T00:37:32+05:30
ప్రభుత్వ ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఐటీఐలలో ఉచితంగా అడ్మిషన్‌లు పొందేందుకు ఈ నెల 19 వరకు గడువు పొడగించినట్లు జిల్లా కన్వీనర్, ఐటీఐ బాలుర ప్రిన్సిపాల్ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్‌అర్బన్, జూన్ 10: ప్రభుత్వ ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఐటీఐలలో ఉచితంగా అడ్మిషన్‌లు పొందేందుకు ఈ నెల 19 వరకు గడువు పొడగించినట్లు జిల్లా కన్వీనర్, ఐటీఐ బాలుర ప్రిన్సిపాల్ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ ఐటీఐలలో 1028 సీట్లు, మూడు ప్రైవేటు ఐటీఐలలో 488 సీట్లు ఉన్నాయని 14 ఏళ్లుపైబడిన అభ్యర్థులు అర్హులని, వయసు పరిమితిలేమి లేవని ఆయన తెలిపారు. ఐటీఐ తెలంగాణ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయని, ఆ వెబ్‌సైట్‌లో కోర్సు ప్రాతిపదికన వెబ్‌ఆప్షన్‌లు పెట్టి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి దరఖాస్తులు చేసుకోవాలని ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వివరాలకు 9948195654, 9490057403 నెంబర్‌లను సంప్రదించాలన్నారు.
Updated Date - 2023-06-11T00:37:32+05:30 IST