ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి రోజు అర్చక పరీక్షలు ప్రశాంతం

ABN, First Publish Date - 2023-01-07T01:31:02+05:30

ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకులుగా సేవలు అందించడానికి నిర్వహిస్తున్న వివిధ ఆగమ అర్చక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌కల్చరల్‌, జనవరి 6: ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకులుగా సేవలు అందించడానికి నిర్వహిస్తున్న వివిధ ఆగమ అర్చక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించారు. శుక్రవారం మాధవనగర్‌ సాయిబాబా కల్యాణ మండపంలో జరిగిన పరీక్షలో 126 మంది అభ్యర్థులకుగాను 95 మంది పరీక్ష రాశారు. 31 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షల్లో 126 మందికిగాను 97 మంది హాజరై 29 మంది గైర్హాజరయ్యారు. ఇన్విజిలేటర్‌లు ఎలాంటి మాల్‌ప్రాక్టిస్‌ లేకుండా పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30గంటలకు ప్రారంభమైన పరీక్షలు సాయంత్రం 5గంటల వరకు కొనసాగాయి. జోనల్‌ ఆఫీసర్‌ విజయ్‌రామారావు, ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ సుప్రియ పర్యవేక్షనలో వివిధ దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు, దేవాదాయశాఖ సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో అర్చకులు హాజరై పరీక్షలు రాశారు.

Updated Date - 2023-01-07T01:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising