బోధనాభ్యాసన సామగ్రితో గుణాత్మక విద్య
ABN, First Publish Date - 2023-06-18T00:54:09+05:30
గుణాత్మక విద్యను అందించడంలో బోధనాభ్యాసన సామగ్రి దోహదం చేస్తుందని డీఈవో రాజు అన్నారు.
కామారెడ్డిటౌన్, జూన్ 17: గుణాత్మక విద్యను అందించడంలో బోధనాభ్యాసన సామగ్రి దోహదం చేస్తుందని డీఈవో రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదుల్లో టీఎల్‌ఎం ఉపయోగించి వినూత్న బోధనా పద్ధతులను వాడడం వల్ల సత్ఫలితాలు వస్తాయని విన్నదానికంటే చేయడం ద్వారా నేర్చుకున్న అంశాలు విద్యార్థుల మదిలో ఎక్కువకాలం గుర్తుఉంటాయని ఆయన పేర్కొన్నారు. తొలిమెట్టు కార్యక్రమం జిల్లాలో అద్భుతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను అభినందించారు. తొలిమెట్టు కార్యక్రమం అమలు తర్వాత ఉపాధ్యాయుల బోధన తీరులో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెరుగుదలలో చాలా మార్పు కనబడిందని ఆయన తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలలో కూడా గుణాత్మక విద్యను అమలుచేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సమగ్రశిక్ష కోఆర్డినేటర్‌లు ఉమారాణి, వేణుగోపాల్, వెంకట్‌రమణారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-27T12:35:28+05:30 IST