ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రిపోర్ట్‌ క్లీన్‌చిట్‌ ఎలా అవుతుంది: మానాల ఫైర్‌

ABN, First Publish Date - 2023-01-18T00:17:01+05:30

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు సంబంధించిన రైస్‌మిల్లులలో జరిగిన అవినీతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రైస్‌మిల్లులలో అక్రమాలు జరగలేదని క్లీన్‌చిట్‌ ఇచ్చారని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ చెప్పడం హాస్యాస్పదమని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానా ల మోహన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 17: బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు సంబంధించిన రైస్‌మిల్లులలో జరిగిన అవినీతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రైస్‌మిల్లులలో అక్రమాలు జరగలేదని క్లీన్‌చిట్‌ ఇచ్చారని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ చెప్పడం హాస్యాస్పదమని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానా ల మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధన్‌ ఎమ్మెల్యే అధికారికంగా నాలుగు రైస్‌మిల్లులను, బినా మీ పేరుతో పది రైస్‌మిల్లులను లీజుకు తీసుకుని అక్ర మాలకు పాల్పడుతున్న విషయం అందరికీ తెలుసన్నా రు. కొన్ని రైస్‌మిల్‌లలో సరైన యంత్రాలు లేకుండానే జిల్లా పౌరసరఫరాల అధికారితో కుమ్మక్కై కెపాసిటీకి మించి ధాన్యం కేటాయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేకు సం బంధించిన రైస్‌మిల్లులకు కెపాసిటీ, మిషనరీతో సంబంధంలేకుండా 5లక్షల 22వేల 344 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించారన్నారు. ఎమ్మెల్యే గత మూడేళ్లుగా తన రైస్‌మిల్లులకు కేటాయించిన వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వకుండా బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి అమ్ముతూ వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిని రైస్‌మిల్లర్‌లపై తనిఖీకి పంపడం ఎంత వరకు సమంజసమో కలెక్టర్‌ సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే, డీఎస్‌వో కలిసి అవినీతికి పాల్పడితే డీఎస్‌వోను విచారణ అధికారిగా పంపడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయంలో కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ నెల 19న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జావెద్‌ అక్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising