ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాలను రూపుమాపాలి

ABN, First Publish Date - 2023-05-02T23:29:21+05:30

బాల్య వివాహాలను రూపుమాపాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బాలరక్ష భవన్‌లో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి టౌన్‌, మే 2: బాల్య వివాహాలను రూపుమాపాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్‌లోని కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బాలరక్ష భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న అనాళ పిల్లల వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలు సేకరించాలని తెలిపారు. అనాథ పిల్లలకు ధ్రువీకరణ పత్రం వచ్చిందా లేదా తెలుసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అనాథ పిల్లల కోసం సీట్లు ఉంటాయని తెలిపారు. అనాథ పిల్లలు వసతి గృహాల్లో ఉండి ఉన్నత విద్యను పూర్తిచేసే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. ఎవరైన పిల్లలను భిక్షాటన చేయిస్తే వారిని పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పదో తరగతి పూర్తి చేసిన అనాథ బాలికలు, పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అనాథ బాలికలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ అనోన్య, జిల్లా బాలల అభివృద్ధి అధికారిణి స్రవంతి, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. మంగళవారం విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్‌ పొదుపుపై వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ను ఆదా చేయుటకు వినియోగదారులు పాటించాల్సిన సూచనలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌సీ రమేష్‌బాబు, డీఈ సాలియా నాయక్‌, వెంకట రంగయ్య, ఏడీఈలు జవహర్‌ నాయక్‌, మల్లేష్‌, ఏఈ ప్రభాకర్‌, ధర్మారెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T23:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising