ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం అభివృద్ధి చేశారని దశాబ్ది ఉత్సవాలు

ABN, First Publish Date - 2023-06-07T23:59:25+05:30

ఏమి అభివృద్ధి చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. బుధవారం కామారెడ్డి పట్టణ పరిధిలోని టెక్రియాల్‌ వద్ద నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

టెక్రియల్‌ వద్ద డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నాణ్యతను పరిశీలిస్తున్న మాజీమంత్రి షబ్బీర్‌అలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నాణ్యత లేకుండా కట్టినందుకా, లబ్ధిదారులకు పంచనందుకా ఈ ఉత్సవాలు

- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ

కామారెడ్డి, జూన్‌ 7: ఏమి అభివృద్ధి చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. బుధవారం కామారెడ్డి పట్టణ పరిధిలోని టెక్రియాల్‌ వద్ద నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టిస్తానని చెప్పి నాణ్యత లేకుండా నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు పంచకుండా పార్టీ కార్యకర్తలకే పంపిణీ చేసినందుకా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు అక్రమాలు జరిగాయని అర్హులైన వారిని తిరిగి ఎంపిక చేసి ఇవ్వాలని అన్నారు. నాణ్యత లేని ఇళ్లు కట్టిన కాంట్రాక్టర్‌ల వద్ద నుంచి బిల్లులు రికవరీ చేయాలని అన్నారు. అక్రమ పద్ధతిలో సాగిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై రీ సర్వే చేపట్టాలని, అర్హుల జాబితాకు సరైన గైడ్‌లైన్స్‌ రూపొందించాలని, వితంతు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 23,476 మంది దరఖాస్తుదారులను డ్రా కు ఎంపిక చేసి, వార్డుల వారిగా డ్రాలు వేసి మొత్తం మున్సిపాలిటీలో, నియోజకవర్గంలో 1,715 మందికే ఇళ్లు కేటాయించడం, అందులోని అనర్హులు, అధికార పార్టీ వారే ఎక్కువ మంది ఉండడంతో మెజార్టీ పేదలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం అర్హులందరికీ కట్టించడంతో పాటు సొంత స్థలాలు ఉన్న వారికి ఇస్తామన్న మూడు లక్షలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అటు కేంద్రం పీఎం అవాస్‌ యోజన కింద పేద ప్రజలందరికీ ఇల్లు కట్టిస్తానని ఇటు రాష్ట్రం డబుల్‌బెడ్‌రూంలు కట్టిస్తారని పేద ప్రజల కన్న కలలను వమ్ముచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుడెం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌ కారంగుల అశోక్‌రెడ్డి, నాయకులు ఐరేని సందీప్‌, శ్రీనివాస్‌, భీమ్‌రెడ్డి, సిరాజుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T23:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising