రేపటి నుంచి బడాపహాడ్ ఉర్సు
ABN, First Publish Date - 2023-02-01T01:37:52+05:30
మండలంలోని పెద్దగుట్ట (బడాపహాడ్) ఉర్సు ఉత్స వాలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్స వాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
పలు రాష్ర్టాల నుంచి భక్తుల రాక
వర్ని, జనవరి 31: మండలంలోని పెద్దగుట్ట (బడాపహాడ్) ఉర్సు ఉత్స వాలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్స వాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఏడాదికోసారి జరిగే ఉర్సు ఉత్సవాలను జలాల్‌పూర్ గ్రామంలో మైనారిటీ సోద రుల ఇంటి వద్ద ప్రత్యేక పజలు, కవ్వాలి, చాదర్ పూలు, మొల్లాలు, ముజావర్‌ల పూజలతో చావిడి వద్ద ప్రత్యేక ఆహ్వాని తులను సన్మానించి ఒంటె, గుర్రం తోడుతో భారీ ర్యాలీగా వెళ్లి పెద్దగుట్టలో కొలువు దీరిన హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ బాబాకు గంధంను సమర్పిస్తారు. రెండో రోజు కవ్వా లీ, మూడో రోజు దీపారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి. వక్ఫ్‌బోర్డు, రెవెన్యూ, పోలీసు శాఖ, వైద్య, రవాణా శాఖల అధికారులు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు చేపడతారు.
ఫ ఉర్సు నిర్వహణకు రూ.14 లక్షలు
పెద్దగుట్ట ఉర్సు ఉత్సవాలకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు రూ.14 లక్షలను కేటాయించింది. వక్ఫ్ బోర్డు సీఈవో ఖాజా మొయినుద్దీన్ (వర్ని మాజీ ఎస్సై)చైర్మన్ మసీ ఉల్లఖాన్, ఇన్‌స్పె క్టర్ అయూబ్‌ఖాన్, డిప్యూటీ సూపరింటెం డెంట్ జమాల్‌లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్పింది. కాగా, ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు భోజన వసతి, తాగునీరు, వైద్య సౌకర్యం, మరుగుదొడ్ల వసతి కల్పనలో వక్ఫ్ బోర్డు అధికారులు పూర్తిగా విఫలం అవుతు న్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఫ మున్నాళ్ల ముచ్చటగా టెండర్ రద్దు
బడాపహాడ్‌లో లక్షల రూపాయల్లో ఉన్న టెండర్ కోట్ల రూపాయలకు పెరగటం టెండ ర్‌ను దక్కించుకున్న వారు భక్తులను నిలువు దీపిడీకి గురి చేయడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి టెండర్ రద్దుకు చర్యలు చేప ట్టారు. రాష్ట్ర జిల్లా వక్ఫ్‌బోర్డు అధికారులు కమిటీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విధానంతో భక్తుల్లో కొత్త ఉత్సాహం పుట్టింది. పోచారం చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ స్పీకర్ చర్యలకు కొందరు గ్రూపులుగా ఏర్పడి హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేపట్టారు. ఆయన చర్యలకు గండి కొట్టేందుకు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, రాష్ట్ర జిల్లా వక్ఫ్‌బోర్డు అధికారులను, శాసన సభ లోని కొందరు పెద్దలను తమవైపు తిప్పుకొని పోచారం శ్రీనివాస్‌రెడ్డి చర్యల కు రాష్ట్రస్థాయిల గండి కొట్టి పాత విధానాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం 2021-22లో రూ.3.20 కోట్లు పలికిన టెండర్ 2022-23లోనూ రూ.3.20 కోట్లకే చేరింది. ఈ టెండర్లను అధకార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు మరి కొందరు కాంగ్రెస్ పార్టీ వారు దక్కించుకుని పాత విధానంలో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
Updated Date - 2023-02-01T01:37:53+05:30 IST