ప్రజావాణికి 64 వినతులు
ABN, First Publish Date - 2023-02-21T00:08:08+05:30
కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 64 వినతులు వచ్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.
కామారెడ్డిటౌన్, ఫిబ్రవరి 20: కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 64 వినతులు వచ్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.ఇందులో రెవెన్యూ 48, డీపీవో 5, మున్సిపల్ 2, డీఆర్‌డీవో 4,ఎస్‌సీడెవలప్‌మెంట్ 1, ఎస్పీ కార్యాలయం 1, ఎలక్ట్రిసిటీ 1, ఎక్సైజ్ 1, ఫిషరిస్ 1 వచ్చినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులకు ప్రజావాణిలో వచ్చిన వినతులను పంపిస్తామని తెలిపారు. అధికారులు పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు. కాగా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన వడ్ల సురేష్ తన తల్లి వడ్ల లక్ష్మీ పేరుపై ఉన్న భూమిని మరోకరి పేరుపైకి మార్చారని ప్రజావాణిలో వినతి పత్రం అందజేశాడు. రె డ్డిపేటలో సర్వేనంబర్ 175/అఏలో 0.0725 గుంటల భూమి ఉండేదని పాస్ పుస్తకంలో ఉన్న భూమికంటే అదనంగా 0.775 గుంట భూమి ఉన్నట్లు పాస్‌బుక్‌లో వచ్చిందని దాని మార్పుచేయాలని రెవెన్యూ అధికారులకు ఇస్తే అసలు ఆ భూమిని తన తల్లిపేరుపై లేకుండా మరో వ్యక్తిపై ఎక్కించారని తెలిపారు. మూడేళ్ల నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరిగిన తనకు న్యాయం జరగడం లేదని, ఉన్న భూమి కంటే ఎక్కువ భూమి వచ్చిందని న్యాయబద్దంగా వెళ్తే తమభూమిని సైతం మరోకరి పేరుమీదకు మార్చి రామారెడ్డి రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేశారని వాపోయాడు.
Updated Date - 2023-02-21T00:08:10+05:30 IST