ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు బోల్తాపడి నవవరుడి మృతి

ABN, First Publish Date - 2023-06-11T03:03:24+05:30

పెళై నెల రోజులైనా కాకముందే కారు బోల్తాపడి నవవరుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ బైపాస్‌పై శనివారం మధ్యాహ్నం జరిగింది. సిద్దిపేట అర్బన్‌ మండలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లిదండ్రులకు, భార్యకు తీవ్రగాయాలు

కారు టైర్‌ పేలడంతో దుర్ఘటన

గజ్వేల్‌, జూన్‌ 10: పెళై నెల రోజులైనా కాకముందే కారు బోల్తాపడి నవవరుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ బైపాస్‌పై శనివారం మధ్యాహ్నం జరిగింది. సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచెప్యాలకు చెందిన పురుమాండ్ల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి (30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నారు. గత నెల 14న నిఖిల్‌రెడ్డి వివాహం అయింది. ఆయన హైదరాబాద్‌లో నూతనంగా తీసుకున్న ఫ్లాట్‌లో పూజ చేసేందుకు భార్య వాణి, తండ్రి ప్రభాకర్‌రెడ్డి, తల్లి సుకృతతో కలసి సిద్దిపేట నుంచి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్‌ బైపాస్‌పై ప్రమాదవశాత్తు కారు టైర్‌ పేలడంతో అదుపుతప్పి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిఖిల్‌ తలకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిఖిల్‌రెడ్డి మృతిచెందారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-06-11T03:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising