ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యార్థుల ఉన్నత భవిష్యతకు కృషి

ABN, First Publish Date - 2023-07-21T00:39:16+05:30

విద్యార్థుల ఉన్నత భవిష్యతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ అన్నారు.

విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), జూలై 20 : విద్యార్థుల ఉన్నత భవిష్యతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షనహాల్‌లో జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ స్కీంలో విద్యార్థులను టోకెన పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను కార్పొరేట్‌ స్కూల్స్‌లో చదివించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. బెస్ట్‌ అవైలబుల్‌ అవైలబుల్‌ స్కీంలో 1వ తరగతి, 5వ తరతగతి విద్యార్థులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారన్నారు. 1వ తరగతికి 94, 5వ తరగతికి 98 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. లక్కీడ్రాలో ఎంపికైన ఒకటో తరగతి విద్యార్థులకు ఈ నెల 24వ తేదీన, 5వ తరగతికి ఎంపికైన విద్యార్థులకు 26వ తేదీన అలాట్మెంట్‌ చేస్తామన్నారు. కార్యక్రమంలో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి, అధికారులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising