ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులవృత్తుల అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2023-06-01T01:07:40+05:30

కులవృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జగదీ్‌షరెడ్డిని పలువురు కులవృత్తుల సంఘాల నేతలు కలిశారు.

నాగులపహాడ్‌లో రింగ్‌బాల్‌ ఆడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌, మే 31: కులవృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జగదీ్‌షరెడ్డిని పలువురు కులవృత్తుల సంఘాల నేతలు కలిశారు. సీఎం కేసీఆర్‌ కులవృత్తులను సంరక్షించడంలో భాగంగా రూ.లక్ష ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించడాన్ని హర్షిస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు అణిచివేసిన అనేక కులాలకు, వృత్తులకు సీఎం కేసీఆర్‌ జీవం పోస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సంఘం నాయకులు యాదగిరి, మల్లయ్య, తిరుపతయ్య, వెంకన్న, మల్లేషం పాల్గొన్నారు.

చిన్నారులతో కలిసి రింగ్‌బాల్‌ ఆడిన మంత్రి

పెన్‌పహాడ్‌: నిత్యం బిజీబిజీగా గడిపే మంత్రి జగదీ్‌షరెడ్డి చిన్నారులతో కాసేపు కాలక్షేపం చేశారు. పెన్‌పహాడ్‌ మండలం నాగులపహాడ్‌ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి సూర్యాపేటకు వెళుతుండగా, మార్గమధ్యంలో గ్రామ కూడలి వద్ద చిన్నారులు రింగ్‌బాల్‌ ఆడుతుండగా గమనించారు. వెంటనే కాన్వాయ్‌ ఆపి కాసేపు రింగ్‌బాల్‌ ఆడి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులు తమకు ఆడుకునేందుకు ఆట వస్తువులు కావాలని కోరగా, ఆయన వాహనంలో ఉన్న ఓ ఆటల కిట్‌ను వారికి అందజేశారు.

Updated Date - 2023-06-01T01:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising