ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేరు కులస్థులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే పైళ్ల

ABN, First Publish Date - 2023-03-26T23:38:07+05:30

మేరు కులస్థులకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.

మేరు సంఘం నూతన కార్యవర్గసభ్యులతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భువనగిరి రూరల్‌, మార్చి 26: మేరు కులస్థులకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక మేరు సంఘం భవనం లో ఆదివారం జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడా రు. సంఘం భవనం నిర్మాణానికి ఇప్పటికే రూ.5లక్షలు మంజూరు చేశామని, మరో రూ.5లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడంతో పాటు వారి సంక్షేమానికి చేయూతనిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేరుకులస్థుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌, మార్కెట్‌ చైర్మన్లు ఎనబోయిన ఆంజనేయులు, ఎడ్ల రాజేందర్‌రెడ్డి, మేరు సంఘం జిల్లా హడక్‌ కమిటీ చీఫ్‌ అడ్వైజర్‌ తాళ్ల భాస్కర్‌, జిల్లా కన్వీనర్‌ తాళ్ల కిరణ్‌కుమార్‌ కీర్తి సత్యనారాయణ, రేణికుంట్ల విఠల్‌, దీకొండ వెంకటేష్‌, ఆదిమూలం బాలరాజు, మేడిగ జగదీష్‌, కొత్త కృష్ణవేణి, మొలుగూరి గౌరీశంకర్‌, కౌన్సిలర్లు కుశంగుల ఎల్లమ్మ రాజు, ఏవీ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T23:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising