మూసీ కాల్వ బ్రిడ్జిపై గోడలు నిర్మించాలి
ABN, First Publish Date - 2023-03-05T00:49:57+05:30
మండల కేంద్రంలో సాయినగర్ కాలనీలో గల మూసీ కాల్వ బ్రిడ్జిపై గోడను నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య డిమాండ్ చేశారు.
వలిగొండ, మార్చి 4: మండల కేంద్రంలో సాయినగర్ కాలనీలో గల మూసీ కాల్వ బ్రిడ్జిపై గోడను నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్, శ్రీశైలం రెడ్డి, రాంచందర్, నర్సింహ, వెంకట్‌రెడ్డి, లింగం, ఆంజనేయులు గోపాల్, సత్తిరెడ్డి, చంద్రమౌళి, భిక్షపతి పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:49:57+05:30 IST