ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే కీలకం

ABN, First Publish Date - 2023-01-26T01:30:35+05:30

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే కీలకమైందని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

నల్లగొండ టౌన్‌, జనవరి 25: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే కీలకమైందని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ఒక మంచి వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ఓటరుకు మాత్రమే ఉందన్నారు. అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకోవాన్నారు. ఎన్నికల సంఘం రూపొందించిన మై భారత్‌ హూ పాటను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖుష్భూగుప్తా, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అంధుల పాఠశాల (డ్వాబ్‌)ను కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా లూయీ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం ఈ నెల 28వ తేదీన జిల్లా అధికారులతో డ్వాబ్‌ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డ్వాబ్‌ ప్రధానకార్యదర్శి పొనుగోటి చొక్కారావుకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఖుష్భూగుప్తా, ఆర్డీఓ జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

నల్లగొండ కల్చరల్‌: జిల్లా కేంద్ర గ్రంఽథాలయాన్ని కలెక్టర్‌ టీ. వినయ్‌కృష్ణారెడ్డి బుధవారం ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ నాగార్జున్‌రెడ్డితో కలిసి సందర్శించారు. భవనం మరమ్మతులు, సోలార్‌ సిస్టమ్‌నెట్‌ మీటర్‌, పోటీ పరీక్షల పుస్తకాలు, ఫర్నిచర్‌, ఖాళీ పోస్టులు, మౌలిక వసతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ పోస్టుల భర్తీ, నిధుల మంజూరు వంటి వాటిని పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు. అనంతరం గ్రంథాలయ సభ్యత్వాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్‌ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, కార్యదర్శి బాలమ్మ, ఉద్యోగులు నర్సింహారెడ్డి, నాగయ్య, నిర్మళాదేవి, రాజేష్‌, శ్రీనివాస్‌, మల్లేష్‌, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising