విశ్వసృష్టికర్త విశ్వకర్మ
ABN, First Publish Date - 2023-09-18T00:43:54+05:30
విశ్వసృష్టికర్త విశ్వకర్మ అని విశ్వకర్మ సంఘం నాయకులు అన్నారు. విశ్వకర్మ జయంతిని జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు.
భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ టౌన్, భువనగిరి టౌన్, రామన్నపేట, సెప్టెంబ రు 17: విశ్వసృష్టికర్త విశ్వకర్మ అని విశ్వకర్మ సంఘం నాయకులు అన్నారు. విశ్వకర్మ జయంతిని జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. భూదాన్‌పోచంపల్లిలోని మహ మ్మాయి దేవాలయ ఆవరణలో జరిగిన కార్యక్ర మంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజ యలక్ష్మీ శ్రీనివాస్, వైస్‌చైర్మన్ బాత్క లింగస్వా మియాదవ్, విశ్వకర్మ సంఘం జిల్లా ఉపాఽ ద్యక్షుడు చౌదరిమెట్టు బిక్షపతిచారి, చేపూరి వీరా చారి, నందిగామ రమేష్‌చారి, గుంటోజు యా దగిరిచారి, ఎర్రోజు చంద్రశేఖర్‌చారి పాల్గొన్నా రు. చౌటుప్పల్ పట్టణంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వ భ్రాహ్మణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం అధ్యక్షుడు పంతంగి మధనాచారి, స్వర్ణ కార సంఘం అధ్యక్షుడు కె. కిషోర్, పోలోజు శ్రీనివాస్ చారి, సంతోష్ కుమార్, శశి భూషన్, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు. ప్రధాని విశ్వకర్మ యోజనను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారం భించి చేసిన ప్రసంగాన్ని భువనగిరిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎల్‌ఈడీ స్కీన్‌పై వీక్షించారు. భువనగిరిలో విశ్వకర్మ జయంతి నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ స ంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి విశ్వ కర్మునికి పూజలు చేశారు. విశ్వకర్మ యోజనను ప్రకటించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు తంగెళ్లపల్లి రవికుమార్, సంఘం నాయకులు కొండపర్తి బా లాచారి, వడ్డకొండ ఉపేంద్రచారి, కొల్లూరు వెంకటాచారి, కుందారపు కృష్ణాచారి, కేమోజు అంజయ్య, సొల్లేటి గోవర్థనాచారి, దేవరకొండ నర్సింహాచారి, కొల్లోజు సతీష్, రాళ్లబండి కృష్ణాచారి, జనగాం నర్సింహాచారి పాల్గొన్నారు. రామన్నపేటలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో మారోజు అనం తచారి, కన్నెకంటి వెంకటేశ్వ రాచారి, చోల్లేటి పాండురంగాచారి, మధుబాబు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-18T00:43:54+05:30 IST