ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వానరం మృతి

ABN, First Publish Date - 2023-05-24T01:02:08+05:30

విద్యుదాఘాతంతో మండలంలోని అమరవరం గ్రామంలో వానరం మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, మే 23: విద్యుదాఘాతంతో మండలంలోని అమరవరం గ్రామంలో వానరం మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరవరం గ్రామంలో ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ తీగలకు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వానరం తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందింది. స్థానికులు కర్రతో వానరాన్ని దించి హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమయాత్ర నిర్వహించిన ఖననం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసు, రమేష్‌, గోపి, నర్సింహారావు, రాము తదితరులు పాల్గొన్నారు.

నామవరంలో గేదె..

మోతె: మండలంలోని నామవరంలో విద్యుదాఘాతంతో గేదె మంగళవారం మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరబోయిన కోటమ్మకు చెందిన పాడి గేదె గ్రామశివారులో మేత మేస్తూ మట్టిపెళ్లి లింగయ్య కోళ్లఫారం సమీపంలో ఉన్న ట్రానఫార్మర్‌ ఎర్త్‌ వైర్లకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇటీవలే రూ.50వేలతో గేదెను కొనుగోలు చేశానని, ప్రభుత్వం తనకు పరిహారం చెల్లించాలని బాధిత మహిళా రైతు కోటమ్మ కోరారు.

Updated Date - 2023-05-24T01:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising