నిరుపయోగంగా నీటి తొట్లు
ABN, First Publish Date - 2023-02-27T01:09:43+05:30
వేసవి కాలంలో పశువులు, మేకలు, గొర్రెల దాహార్తిని తీర్చడానికి లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నీటి తొట్లు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి.
లక్షలాది రూపాయలు వృథా
దాహార్తితో పశువులు, జీవాలు
మద్దిరాల, ఫిబ్రవరి 26: వేసవి కాలంలో పశువులు, మేకలు, గొర్రెల దాహార్తిని తీర్చడానికి లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నీటి తొట్లు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నీటి తొట్లను నిర్మించారు. మండలంలోని 17గ్రామ పంచాయతీల్లో ఒక్కో గ్రామానికి రెండు, మూడు నీటి తొట్లను ఏర్పాటుచేశారు. ఒక్కో నీటి తొట్టిని రూ.24 వేల వ్యయంతో నిర్మించారు. కేవలం రెండు, మూడు గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని తొట్లలో పిచ్చి మొక్కలు మొలిచాయి. తూర్పుతండాలో నీటి తొట్టి కూలిపోయాని అధికారులు పట్టించుకో వడం ఆ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండా కాలం సమీపించినం దున ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నీటి తొట్లను అందుబాటులోకి పశు వులు, జీవాలకు నీటి కొరత లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
నీటి తొట్లను అందుబాటులోకి తేవాలి
కొన్ని గ్రామాల్లో నీటి తొట్లు శిథిలావస్థకు చేరాయి. వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్లకు అఽధికారులు మరమ్మతు చేయించి నీటిని నింపి పశువులు, జీవాల దాహార్తిని తీర్చాలి.
- భూక్య రవి, తూర్పుతండా
Updated Date - 2023-02-27T01:09:45+05:30 IST