ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షం.. ఆందోళనలో రైతాంగం

ABN, First Publish Date - 2023-03-19T00:14:29+05:30

జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వాతావరణంలో మార్పుతో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. ఊరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటాయన్న ఆందోళన చెందుతున్నారు.

మఠంపల్లి శివారులో ఆరబోసిన మిర్చి పంట వద్ద వరద నీటిని తొలగిస్తున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మఠంపల్లి / నడిగూడెం, మార్చి 18: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వాతావరణంలో మార్పుతో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. ఊరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటాయన్న ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షాలతో మఠంపల్లి, నడిగూడెం మండలాల్లోని వరి, మిరప, మామిడి పండ్ల తోటల్లోకి నీరు చేరింది. మఠంపల్లి మండలం రఘునాథపాలెం, గుండ్లపల్లి, వెంకటాయపాలెం, భీల్యానాయక్‌తండా, యాతవాకిళ్ళ, హనుమంతులగూడెం, మంచ్యాతండా, చెన్నాయిపాలెం, మఠంపల్లి, చౌటపల్లి, బక్కమంతులగూడెం గ్రామాల్లో వరి, మిర్చి, మామిడి పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. మండలంలో సుమారు 3,500 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా ప్రస్తుతం కాయదశలో ఉంది. పంట ఈదురు గాలులు, వడగండ్ల పడితే తీవ్రనష్టం వాటిల్లుతుందని రైతులు భయాందోళన చెందుతున్నారు. వరి పంట 15 వేల ఎకరాల్లో సాగు కాగా, పంటలు పొట్ట దశలో ఉన్నాయి. అకాల వర్షంతో పంటకు నష్టం కలగొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకా మూడు రోజుల పాటు వాన ఉంటుందనే వాతావరణ శాఖ సమాచారంతో రైతుల్లో నిరాశ మొదలైంది. కొన్ని గ్రామాల్లో మిర్చి పంట చేతికి రావడంతో వాటిని కాపాడేందుకు రైతులు నానాతిప్పలు పడుతున్నారు. దీనికి తోడు ఈదురుగాలులకు మఠంపల్లి మండలవ్యాప్తంగా విద్యుత సరఫరా నిలిచిపోయింది. విద్యుత అధికారుల నిర్లక్ష్యంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 12 గంటల తరువాత సాయంత్రం విద్యుతను పునరుద్ధరించారు.

ఆకాశంలో మబ్బులు

నడిగూడెం మండలంలో రెండు రోజులుగా మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లబడింది. మోస్తారు వర్షం పడినప్పటికీ చేతికొచ్చే సమయంలో పంట దెబ్బతింటుందని వరి, మిర్చి, మామిడి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఆకాశంలో మబ్బులు కమ్మీ ఈదురు గాలులు వీశాయి. ఈదురుగాలులకు నడిగూడెం శివారులోని చెట్లకొమ్మలు విద్యుత తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొమ్మలను తొలగించి సాయంత్రానికి విద్యుత సరఫరాను పునరుద్ధరించారు.

Updated Date - 2023-03-19T00:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising