బస్వాపూర్ రిజర్వాయర్ వద్దే ఉగాది
ABN, First Publish Date - 2023-03-22T23:32:16+05:30
బస్వాపురం రిజర్వాయర్ పరిధిలోని లప్పానాయక్ తండా నిర్వాసితులు ప్రాజెక్ట్ వద్దే బుధవారం ఉగాది వేడుకలు జరుపుకొని నిరసన తెలిపారు. ఇళ్ల వద్ద పండుగ వేడుకలను బంద్‌చేసి దీక్షల వద్దనే భక్షాలు, వంటకాలు చేసుకొని అక్కడే ఆరగించారు.
వినూత్నరీతిలో నిర్వాసితుల నిరసన
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 22: బస్వాపురం రిజర్వాయర్ పరిధిలోని లప్పానాయక్ తండా నిర్వాసితులు ప్రాజెక్ట్ వద్దే బుధవారం ఉగాది వేడుకలు జరుపుకొని నిరసన తెలిపారు. ఇళ్ల వద్ద పండుగ వేడుకలను బంద్‌చేసి దీక్షల వద్దనే భక్షాలు, వంటకాలు చేసుకొని అక్కడే ఆరగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధీరావత్ బుజ్జీశంకర్‌నాయక్ మాట్లాడుతూ పదేళ్ల నుంచి ఇప్పటివరకు పూర్తిగా పరిహారం, ఇంటి స్థలాలు ఇవ్వకుండా అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. దాదాపు రిజర్వాయర్ పనులు పూర్తి కావొస్తున్నాయని, వెంటనే తమను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాంక్యానాయక్, వార్డు సభ్యులు హారతి, సురే్‌షనాయక్, లక్ష్మీ, నిర్వాసితులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-22T23:32:16+05:30 IST