మతిస్థిమితం లేని వ్యక్తి ఆశ్రమానికి తరలింపు
ABN, First Publish Date - 2023-06-07T00:50:23+05:30
మతిస్థిమితం లేని వ్యక్తి భువనగిరి శివారులోని పగిడిపల్లి హనుమాన్ దేవాలయం పరిసరాల్లో సంచరిస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మతిస్థిమితం లేని వ్యక్తిని అనాథాశ్రమానికి తరలిస్తున్న పోలీసులు
భువనగిరి రూరల్, జూన్ 6: మతిస్థిమితం లేని వ్యక్తి భువనగిరి శివారులోని పగిడిపల్లి హనుమాన్ దేవాలయం పరిసరాల్లో సంచరిస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం రూరల్ కానిస్టేబుల్ అశోక్ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించి అతనికి భోజనం చేయించి అనంతరం అతని అచూకీ కోసం యత్నించగా అతను ఎలాంటి వివరాలు చెప్పలేదు. అయితే అనాథాశ్రమ నిర్వాహకులు శంకర్‌కు సమాచారం ఇచ్చి అతనికి అప్పగించారు.
Updated Date - 2023-06-07T00:50:59+05:30 IST