ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండాలలో ఈదురుగాలుల బీభత్సం

ABN, First Publish Date - 2023-06-01T01:03:35+05:30

గుండాల మండలకేంద్రంతోపాటు రామారం, సీతారాంపురం, మరిపడగ, బ్రాహ్మణపల్లి, మాసాన్‌పల్లి తదితర గ్రామాల్లో బుఽధవారం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.

రామారం-బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై కూలిన చెట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపై కూలిన చెట్లు

పిడుగు పడి ఎద్దు మృతి

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

గుండాల, మే31: గుండాల మండలకేంద్రంతోపాటు రామారం, సీతారాంపురం, మరిపడగ, బ్రాహ్మణపల్లి, మాసాన్‌పల్లి తదితర గ్రామాల్లో బుఽధవారం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గుండాల-రామారం, సీతారాంపురం-మాసాన్‌పల్లి, రామారం-బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య చెట్లు కూలిపోవడంతో ఆయా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలోని మరిపడగ గ్రామంలో పిడుగుపడి గ్రామానికి చెందిన రైతు కొండబోయిన మంకయ్య ఎద్దు మృతి చెందింది. పశువులను మేపుతున్న రైతు కొద్ది దూరంలో ఉండడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మండలంలోని సీతారాంపురం గ్రామంలో దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన పందిరి కూలింది. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చెట్టు కూలడంతో, అదే సమయంలో చెట్టు కింద రైతు ఉట్ల భద్రయ్యకు నడుము, అతని కుమారుడు రవికి కాలు విరిగింది. వల్లాల కిష్టయ్య, వల్లాల గంగయ్య చేతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన సమీప రైతులు 108కు సమాచారం అందించగా జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-06-01T01:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising