ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్వామివారిని తనివితీరా చూసేలా!

ABN, First Publish Date - 2023-08-11T00:28:00+05:30

జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.

రాతిబండలను చెక్కుతున్న కార్మికులు

చెర్వుగట్టు గర్భాలయంలో రాతిబండల తొలగింపు

నార్కట్‌పల్లి, ఆగస్టు 10: జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని తనివితీరా దర్శించుకునేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాన గర్భాలయంలో భక్తులకు అసౌకర్యంగా ఉన్న రాతిబండ(పొర)లను తొలిచే పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడేళ్ల కిందటే ఈ పనులు చేయాల్సి ఉంది. కానీ పరిపాలనా, సాంకేతిక ఆమోదం లభించడంలో జాప్యం జరగడంతో పాటు దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో ప్రధాన కారణమైంది.

క్యూలైనలో ఇబ్బంది

క్షేత్ర చారిత్రక నేపథ్యం ప్రకారం పరశురాముడు స్వామివారి లింగాకారాన్ని గుహాలోనే ప్రతిష్టించి తపస్సు చేశారు. దీంతో అప్పటి నుంచి కూడా మూలవిరాట్టుగా ఉన్న లింగాకారం కొలువైన చిన్నపాటి గుహలో కేవలం ఒక అర్చకుడే కూర్చునేంత స్థలం మాత్రమే ఉంది. మూలవిరాట్టు ఎదుట ఉన్న ప్రాంగణం కూడా రాతిబండల చేత ఇరుకుగా ఉంది. దీంతో మహామంటపం వద్ద ఉన్న ప్రధానాలయ ప్రవేశద్వారం నుంచి స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో వచ్చే భక్తులు వంగి వెళ్తూ స్వామివారిని దర్శించుకునే సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో రాతిబండల పొరలను తొలగించి భక్తులకు స్వామి దర్శనం సౌకర్యంగా కలిగేలా చేస్తున్నారు.

ఆగమశాస్త్రం మేరకే: భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా దేవదాయ స్థపతి పరిశీలించి, సూచించిన మేరకు ఆగమశాస్త్ర ప్రకారం రాతిబండ పొరల తొలగింపు పనులను ప్రారంభించారు. దేవస్థానం నిధులు సుమారు రూ.14లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రాతిబండల తొలగింపు పనులు పూర్తయ్యేందుకు సుమారు 4 నుంచి 6 నెలలు పట్టొచ్చని చెబుతున్నారు. ప్రధానాలయంలోని రాతిబండ ధృడమైన మచ్చరకం బండకావడంతో తొలగించడం అంత సులువుగా కాదని కార్మికులు చెబుతున్నారు. బండరాయిని దాదాపు ఫీటున్నర మందం తొలగించాల్సి ఉంది. ఇరుకు ప్రదేశంలో రాక్‌ కటింగ్‌ బ్లేడ్‌ వీల్స్‌ ద్వారానే చేయాల్సి వస్తుంది. దీనికి తోడు ఆలయం మూసివేసే సమయాల్లో మాత్రమే రోజుకు 5 గంటల పాటే రాతి పొరని చెక్కే పనులు చేయాల్సి వస్తుండటంతో సమయం ఎక్కువ పడుతుందని దేవదాయ శాఖ సహాయ ఇంజనీర్‌ రాజయ్య చెప్పారు.

మూలవిరాట్టు ఆలయ దర్వాజ వెడల్పు

పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి మూలవిరాట్టు కొలువై ఉన్న గుహ దర్వాజను కూడా వెడల్పు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న దర్వాజతో క్యూలైనలో వచ్చే భక్తులకు స్వామివారి మూలవిరాట్టును దర్శించడం కష్టమవుతోంది. దీంతో దర్వాజ సైజును వీలైనంత మేరకు వెడల్పు చేయనున్నారు.

Updated Date - 2023-08-11T00:28:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising