పార్టీని వీడేది లేదు.. కోదాడ టికెట్ నాదే
ABN, First Publish Date - 2023-07-21T01:41:32+05:30
పార్టీని వీడేది లేదు.. కోదాడ టికెట్ నాదే
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శశిధర్‌రెడ్డి
కోదాడ, కోదాడ టౌన, జూలై 20: బీఆర్‌ఎ్‌సను వీడేది లేదని, వచ్చే ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యే టికెట్ తనదేనని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడలోని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవిర్భావం నుంచి తాను బీఆర్‌ఎస్ పార్టీలో పనిచేస్తున్నానని, పార్టీ మారుతున్నానని కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీ్‌షరెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. గెలిచే అభ్యర్థులకే పార్టీ అధిష్ఠానం టికెట్ ఇస్తుందని, అందులో తాను ఉంటానన్నారు. .
మల్లయ్యకు టికెట్ ఇస్తే సహకరించేది లేదు: ఏర్నేని బాబు
పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులకు కాదని, ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే పార్టీకి ఓటు వేస్తాం కాని, ప్రచారం చేయబోమని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు అన్నారు. గత ఎన్నికల్లో మల్లయ్యయాదవ్‌కు టికెట్ ఇస్తే తాము సహకరించామన్నారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజంకాదన్నారు. సమావేశంలో చిలుకూరు జడ్పీటీసీ బొలిశెట్టి శిరీషానాగేంద్రబాబు, నాయకులు గుండపనేని నాగేశ్వరరావు, తిపిరిశెట్టి రాజు, రాయపూడి వెంకటనారాయణ, సుంకరి నాగయ్య, హసన్, అలీ, రామాచారి, నాగేశ్వరరావు, చలిగంటి లక్ష్మణ్, కంచుకొమ్ముల శంకర్ పాల్గొన్నారు.
- రైతులు, కూలీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు. కోదాడ బస్‌స్టేషన సమీ పంలో వ్యవసాయ కూలీలకు లంచ బ్యాగులను పంపిణీ చేశారు. మీరా, నాగరాజు,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T01:41:53+05:30 IST