ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2023-06-11T00:41:44+05:30

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ అన్నారు.

సూర్యాపేటలో కేసీఆర్‌, జగదీష్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌) / సూర్యాపేట అర్బన్‌/ నూతనకల్‌ / మద్దిరాల, జూన్‌ 10 : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ అన్నారు. దివ్యాంగుల ఫించన్‌ను రూ.4,016 లకు పెంచడాన్ని హర్షిస్తూ బీఆర్‌ఎస్‌ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీష్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరి కష్టసు ఖాలను తెలుసుకుని వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తు న్నారని కొనియాడారు.కార్యక్రమంలో సంఘం నాయకులు నయీం, జానయ్య, నాగయ్య, లింగయ్య, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, సుశీల, నాగ మణి, సరిత, కవిత, క్రిష్ణవేణి, అఖిల్‌, జానీ, వెంకన్న, రవికుమార్‌, మల్సూర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో సూర్యా పేటలో మంద కృష్ణమాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిం చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్య మాదిగ, నాయకులు చింత సతీష్‌, జహీర్‌బాబా, బాబు, దైద వెంకన్న, బిక్షపతిగౌడ్‌, సైదులు, లింగయ్య, రాంకుమార్‌ పాల్గొ న్నారు. నూతనకల్‌ మండలంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, బీఆర్‌ఎస్‌ దివ్యాంగుల విభాగం రాష్ట్ర నాయకుడు నేండ్ర మల్లారెడ్డి, నాయకులు బద్దం వెంకట్‌రెడ్డి, సురిగి ఉప్ప లయ్య, బిక్షంరెడ్డి పాల్గొన్నారు. మద్దిరాల మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి దివ్యాంగులు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్‌ రజాక్‌, నర్సయ్య, వెంకటయ్య, సోమయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising