స్వచ్ఛంద సేవల్లో రోటరీ క్లబ్ అగ్రగామి
ABN, First Publish Date - 2023-07-21T00:43:20+05:30
స్వచ్చంద సేవల్లో రోటరీ క్లబ్ అగ్రగామి అని ఆ క్లబ్ 3150 డిస్ర్టిక్ట్ గవర్నర్ బోసిరెడ్డి శంకర్‌రెడ్డి అన్నారు.
క్లబ్ డిస్ర్టిక్ట్ గవర్నర్ శంకర్‌రెడ్డి
భువనగిరి టౌన్, జూలై 20: స్వచ్చంద సేవల్లో రోటరీ క్లబ్ అగ్రగామి అని ఆ క్లబ్ 3150 డిస్ర్టిక్ట్ గవర్నర్ బోసిరెడ్డి శంకర్‌రెడ్డి అన్నారు. గురువారం భువనగిరిలో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ సమావేశంలో ఆయ న మాట్లాడారు. స్వచ్ఛంద సేవలు అందించడమే క్లబ్ సభ్యుల లక్ష్యమని అన్నారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఫక్కీర్ కొండల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పోలి శంకర్‌రెడ్డి, కార్యదర్శిగా ఎండి.అనీఫ్ మహమాన్, కోశాధికారిగా తుమ్మల మల్లేశం, డాక్టర్ సమంత్‌రెడ్డి, బుస్సా రమేష్, పగడాల జలేందర్‌రెడ్డి, ర్యాకల శ్రీనివాస్, డాక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ ఉపేందర్, తదితర కమిటీచే ఆయన ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ కె నిమ్మయ్య, శెట్టి బాలయ్య యాదవ్, కొండల్‌రెడ్డి, డాక్టర్ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:43:20+05:30 IST