ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మురికి నీటి సమస్యను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-09-22T00:44:39+05:30

పట్టణంలోని రాయగిరి పరిధి బాలంపల్లి వెళ్లే మార్గమధ్యలో నెలకొన్న మురికినీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ కోరారు.

భువనగిరి టౌన/ భువనగిరి అర్బన, సెప్టెంబరు 21: పట్టణంలోని రాయగిరి పరిధి బాలంపల్లి వెళ్లే మార్గమధ్యలో నెలకొన్న మురికినీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌ కోరారు. ఈమేరకు గురువారం రాయిగిరి రహదారులపై నిలిచిపోయిన మురికి నీటిని, ఔట్‌ లైన్లను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర ఎకరంలో చేరిన మురుగునీటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాలుగో వార్డులో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, దోమలు, ఈగలతో సీజన వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. ఇబ్బందులను తొలగించేందుకు మునిసిపల్‌ అధికారులు ఆ మురుగునీటిని తరలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి రక్షించేందుకు పటిష్టమైన డ్రైనేజీని నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఈరపాక నర్సింహా, స్థానికులు రాజేందర్‌ ప్రసాద్‌, పరిపూర్ణచారి, కరుణాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:44:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising