పాత కలెక్టరేట్ ఇక ఐటీ హబ్
ABN, First Publish Date - 2023-09-21T23:50:49+05:30
జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఇక నుంచి ఐటీ కంపెనీ కార్యక్రమాలు నిర్వహించే హబ్‌గా మారనుంది.
అమెరికాలోని కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమీక్ష
10 రోజుల్లో ప్రారంభానికి సన్నాహాలు
సూర్యాపేట(కలెక్టరేట్), సెప్టెంబరు 21 : జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఇక నుంచి ఐటీ కంపెనీ కార్యక్రమాలు నిర్వహించే హబ్‌గా మారనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐటీ హబ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ నిర్వహణ కోసం పాత కలెక్టరేట్‌ను వారం పది రోజుల్లో సిద్ధం చేసేందుకు మంత్రి జగదీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కృషి చేస్తున్నారు. ఐటీ హబ్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
పాత జిల్లా కలెక్టరేట్ భవనంలో...
జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కార్యకలాపాల నిర్వహణ కోసం అమెరికన ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి జగదీ్‌షరెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఐటీ హబ్‌లో కంపెనీల నిర్వహణ కోసం అమెరికాలోని ఐటీ కంపెనీల ప్రతినిధులు రాజ్ సంగాని, శశిదేవిరెడ్డి, సందీ్‌పరెడ్డి కట్టా, ఫణి పాలేటి, ప్రియారాజ్, విజయ్ దండ్యాల, అభిషేక్ బోయినపల్లి, తెలంగాణ ఐటీ ఇన్వె్‌స్టమెంట్ సీఈవో విజయ్ రంగినేని, టాస్క్ కోఆర్డినేటర్ ప్రదీ్‌పలతో మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడారు. కొద్దిరోజుల్లో హబ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Updated Date - 2023-09-21T23:50:49+05:30 IST