క్రషర్ మిల్లు లీజును రద్దు చేయాలి
ABN, First Publish Date - 2023-03-02T01:25:33+05:30
The lease of the crusher mill should be cancelled
నాగారం, మార్చి 1: మండలంలోని ఫణిగిరి గ్రామ పరిధిలోని చెన్నాపురం గుట్టపై ఏర్పాటు చేసిన క్రషర్ మిల్లు లీజును వెంటనే రద్దు చేయాలని శాంతినగర్ గ్రామానికి చెందిన బండను కొట్టే కాశీ పనివారు కోరారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాల యం ఎదుట సూర్యాపేట–జనగాం జాతీయ రహదారి 365పై ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో గుట్టలపై బండలను కొట్టుకుని తరతరాలుగా జీవిస్తూ వస్తున్నామన్నారు. గుట్టపై క్రషర్ మిల్లుకు అనుమతులు ఇచ్చినం దుకు తాము ఉపాధిని కోల్పోయి రోడ్డుపై పడే పరిస్థితి ఉందన్నారు. ఘటనా స్థలానికి తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్ చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ మేరకు వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు కాశీ పనివారు అందజేశారు. కార్యక్రమంలో శాంతినగర్ సర్పంచ్ నాగుల్‌మీరా, బడేసాహేబ్,షేక్ సైదులు, హూస్సేన్ గ్రామస్థులు పాల్గొన్నారు.
చెల్లిం
Updated Date - 2023-03-02T01:25:40+05:30 IST