ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయకట్టు చివరి భూములకు నీరందించాలి

ABN, First Publish Date - 2023-03-02T00:54:10+05:30

నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు నీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీరందించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్‌ అన్నారు. ఆయకట్టు పరిధిలోని అనంతగిరి,

కోదాడ-ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోదాడ టౌన, మార్చి 1 : నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు నీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీరందించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్‌ అన్నారు. ఆయకట్టు పరిధిలోని అనంతగిరి, కోదాడ మండల రైతులతో కలిసి కోదాడ-ఖమ్మం రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌కే మేజర్‌ పరిధిలోని మొగలాయికోట, శాంతినగర్‌,లక్కవరం, తమ్మర, గోండ్రియాల, చిమిర్యాల, కొత్తగూడెం గ్రామాల్లో వరి పంటకు నీరందక పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు. ఎన్నెస్పీ ఎస్‌ఈ నర్సింహారావు రైతుల వద్దకు చేరుకుని చివరి భూములకు నీరు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు నర్సింహారావు, సైదయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, కిరణ్‌కుమర్‌రెడ్డి, శివాజీ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!