ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జిల్లాలో స్వల్ప రిక్టర్‌ స్కేల్‌పై 2.3గా నమోదు

ABN, First Publish Date - 2023-09-20T00:06:17+05:30

సూర్యాపేట జిల్లాలో ని చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లో సోమవారం రాత్రి భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది.

మేళ్లచెర్వు, సెప్టెంబరు 19: సూర్యాపేట జిల్లాలో ని చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లో సోమవారం రాత్రి భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది. 2020 నుంచి ఇక్కడ స్వల్ప తీవ్రతతో భూప్రకంపనలు వస్తుండ గా, ఆరు నెలలుగా భూప్రకంపనలు లేవు. కాగా, సోమవారం రాత్రి 9.50గంటల సమయంలో 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 2.3గా ఉంటుందని అధికారులు తెలిపారు. స్వల్పంగా భూకంప నం ఉండటంతో ఎటువంటి నష్టం చోటుచేసుకోలేదు. అ యితే భూప్రకంపనంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం తిరిగి వస్తుందనే భయంతో రాత్రంతా ప్రజ లు జాగారం చేశారు. 2020 నుంచి ఈ ప్రాంతంలో స్వ ల్పంగా భూకంపనాలు వందల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో చింతలపాలెం మండలం వెల్లటూ రు, దొండపాడు గ్రామాల్లో అధికారులు రిక్టర్‌ స్కేల్‌ ను ఏర్పాటు చేశారు.స్వల్ప భూప్రకంపనలు వందల సంఖ్య లో ఈ మూడేళ్లలో చోటుచేసుకున్నాయి. అయితే చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన వచ్చిన భూకం పం రిక్టర్‌ స్కేల్‌పై 3.2గా నమోదైంది. అప్పటి నుంచి ఆరు నెలలుగా ఎటువంటి ప్రకంపనలు లేకపోవడంతో ఈ ప్రాంతం ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈనేపథ్యంలో సోమవారం మరోసారి భూకంపనాలు న మోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-09-20T00:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising