ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

ABN, First Publish Date - 2023-02-16T00:52:01+05:30

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలు నాయక్‌, టీపీసీసీ సభ్యుడు కేతావత్‌ బిల్యానాయక్‌, ఆదివాసి జాతీయ కోఆర్డీనేటర్‌ నేనావత్‌ కిషన్‌నాయక్‌ అన్నారు.

చింతపల్లి: గొడుకొండ్లలో పాదయాత్రలో పాల్గొన్న బాలు, బిల్యా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి, ఫిబ్రవరి 15: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీ ఎమ్మెల్యే నేనావత్‌ బాలు నాయక్‌, టీపీసీసీ సభ్యుడు కేతావత్‌ బిల్యానాయక్‌, ఆదివాసి జాతీయ కోఆర్డీనేటర్‌ నేనావత్‌ కిషన్‌నాయక్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్‌సేహాత్‌ జోడో పాదయాత్ర మండలంలోని వీటీనగర్‌, గొడుకొండ్ల, పోలేపల్లి రాంనగర్‌, బోటిమీదితండాల్లో బుధవారం నిర్వ హించారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేశార న్నా రు. రైతులకు రుణమాఫీ చేయకపోవడంతోపాటు అప్రకటిత విద్యుత్‌ కోతలతో రైతుల పంటలు ఎండిపోతున్నా సీఎం కేసీఆర్‌కు చీమకు ట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాం గ్రెస్‌ నాయకులు డాక్టర్‌ రవినాయక్‌, ఎంపీపీ కొండూరు భవానిపవ న్‌కుమార్‌, నాయకులు అంగిరేకుల నాగభూషణం, ఎ.గోవర్ధన్‌, ఊరే లక్ష్మణ్‌, దొంతం సంజీవరెడ్డి, యాదయ్యగౌడ్‌, పురుషోత్తంరెడ్డి ఉన్నారు.

త్వరలో మునుగోడులో హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

చండూరు: మునుగోడు నియోజకవర్గంలో త్వరలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను చేపట్టనున్నట్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్‌నేత బుధవారం ప్రకటనలో తెలిపారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా నుంచి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ప్రారంభించారని తెలిపారు. మునుగోడు నియోక వర్గంలో ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతితో కలిసి యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అన్ని వర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత యాత్ర ప్రారంభించి నెల రోజులపాటు కొనసాగేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-02-16T00:52:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising