లక్ష్మీనృసింహుడికి స్వాతి నక్షత్రోత్సవ పర్వాలు
ABN, First Publish Date - 2023-08-22T23:57:40+05:30
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేక పూజలు వైభవంగా కొనసాగాయి.
యాదగిరిగుట్ట, ఆగస్టు 22: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేక పూజలు వైభవంగా కొనసాగాయి. గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టా అలంకారమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించి 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. భక్తులు, స్థానికులు కొండచుట్టూ గిరిప్రదక్షిణలు చేసి కొండపైన ప్రధానాలయంలోని మూలమూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట దేవాలయంలోనూ స్వాతి జన్మనక్షత్రోత్సవ పర్వాలు వైభవంగా కొనసాగాయి. యాదగిరీశుడి సన్నిధిలో, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు వైభవంగా కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.24,78,943 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.
ముచ్చటగా మూడోసారి సీఎంగా కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఇష్టదైవం లక్ష్మీనృసింహుడిని వేడుకున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.
ప్రఽధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ముఖమండపంలోని ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. స్వామిని రాష్ట్ర హ్యాండీకా్ట్ర్‌ప్ట్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన చైర్మన బొల్లం సంపతకుమార్‌గుప్తా, యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు.
Updated Date - 2023-08-22T23:57:40+05:30 IST