దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు
ABN, First Publish Date - 2023-02-18T00:59:53+05:30
దివ్యాంగులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి కేవీ.కృష్ణవేణి ఒక ప్రకటనలో కోరారు.
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి17: దివ్యాంగులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి కేవీ.కృష్ణవేణి ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 17మండలాలు, ఆరు మునిసిపాలిటీల్లో బ్యాంకుతో సంబంధం లేకుండా వంద శాతం 23యూనిట్లకు రూ.5వేల రుణం, బ్యాంక్ లిం క్‌తో 3యూనిట్లు (రూ.1,00,000ల యూనిట్‌కు రూ.80,000 సబ్సిడీ, రూ.2, 00,000ల యూనిట్ రూ.1,40,000లు, రూ.3,00,000ల యూనిట్ రూ.1,80,000ల సబ్సిడీతో) 26యూనిట్లు మంజూరు చేసినట్లు, జిల్లాలోని 21 నుంచి 55 ఏళ్ల వయస్సు వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
Updated Date - 2023-02-18T00:59:55+05:30 IST