ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిహరులకు విశేష పూజలు

ABN, First Publish Date - 2023-02-14T00:55:59+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరిహరులకు సోమవారం విశేష పూజలు శాస్త్రోక్తంగా కొనసా గాయి.

నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలయ నిత్యాదాయం రూ.24.97లక్షలు

బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలకు ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి13: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరిహరులకు సోమవారం విశేష పూజలు శాస్త్రోక్తంగా కొనసా గాయి. స్వయంభూ పాంచనారసింహుడికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీ తిలో..కొండపైన అనుబంధ శివాలయంలో కొలువుదీరిన రామలింగేశ్వ రుడికి, స్పటిక మూర్తులకు శైవాగమ పద్దతిలో నిత్యవిధి కైంకర్యాలు నిర్వహించారు. ప్రభాతవేళ సుప్రభాతంతో లక్ష్మీనృసింహుడిని మేల్కొలిపిన పూజారులు గర్భాలయంలోని మూలమూర్తులకు, సువర్ణ ప్రతిష్టా అలం కారమూర్తులను వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం జరిపి తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన అనుబంధ ఆలయమైన శివాల యంలో పర్వత వర్థినీ సమేత రామలిగేశ్వరుడిని, ముఖమండపంలోని స్పటిక మూర్తులను అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకం జరిపారు. శివపార్వతుల సహస్రనామ పఠనాలతో భిల్వపత్రార్చనలు జరిపారు. సాయంత్రం వేళ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల అలంకార వెండి జోడు సేవలు, శివాలయంలో శివ పార్వతుల ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి తిరువీధుల్లో సేవోత్సవం నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.24,97,159 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరి క్షేత్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి వార్షిక తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు కొనసాగ నున్నాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల చెంత ఈ సంవత్సర తిరుకల్యాణోత్సవ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలకు ఆలయ అర్చకులు సోమవారం సంప్రదాయరీతిలో పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-02-14T00:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising