ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాపూర్ణాహుతితో శివాలయ ఉత్సవాలు పూర్తి

ABN, First Publish Date - 2023-02-21T00:22:24+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని అనుబంధ రామలింగేశ్వరుడి శివాలయంలో శైవాగమ పద్ధతిలో పాంచాహ్నిక దీక్షతో ఈ నెల 15న ఆరంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతి,

శివాలయ యాగశాలలో మహాపూర్ణాహుతి పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని అనుబంధ రామలింగేశ్వరుడి శివాలయంలో శైవాగమ పద్ధతిలో పాంచాహ్నిక దీక్షతో ఈ నెల 15న ఆరంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మహాపూర్ణాహుతి, త్రిశూల స్నాన ఘట్టాలతో పరిసమాప్తమయ్యాయి. ముందుగా శివాలయంలోని రామలింగేశ్వరస్వామిని కొలుస్తూ నిత్యారాధనలు, మూల మంత్రజపాలు, వేదపారాయణాలు, నందిసూక్త పఠనాలను అర్చకబృందం, రుత్వికులు నిర్వహించారు. యాగశాలలో పంచసూక్త, నమక, చమక, రుద్ర పఠనాలతో హోమ పూజలు జరిపి మహాపూర్ణాహుతి వేడుకలకు తెరతీశారు. రుత్వికులు, వేదపండితులు, అర్చకబృందం వేదమంత్ర పఠనాలు, ఆస్థాన విద్యాంసుల మంగళవాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి పర్వాలను శైవాగమ పద్ధతిలో శాసో్త్రక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేక సేవలో తీర్చిదిద్దిన అర్చకస్వాములు పరమశివుడి ఆయుధమైన శూలాన్ని మంగళవాయిద్యాలతో శివాలయంలో ఊరేగింపు నిర్వహించి కొండపైన విష్ణుపుష్కరిణిలో త్రిశూలతీర్థ స్నాన ఘట్టాలను నిర్వహించారు. పరమశివుడి ప్రతినిధిగా, ఆయుధ రాజముగా సేవలందించే శూలాన్ని అభిషేకిస్తే పరమేశ్వరుడు తనను కొలిచిన భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడని లోకోక్తిని, శైవాగమ పద్ధతిలో ఆరు రోజులుగా కొనసాగిన మహాశివరాత్రి మహోత్సవాలు పరిసమాప్తమయ్యాయని ఆచార్యులు భక్తులకు వివరించారు. సాయంత్రం వేద పారాయణాలు, చతుస్థానార్చనలు, సోమకుంభార్చనలు, మూల మంత్ర పఠనాలు జరిపిన అర్చకులు మహోత్సవాల్లో అలసిసొలసిన ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరులను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక సేవలో తీర్చిదిద్ది డోలారోహణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అశేష భక్తజనులు ఈ వేడుకలను వీక్షించి తరించారు. ఈ మహోత్సవాలను దేవస్థాన ప్రఽధాన పురోహితులు గౌరిభట్ల సత్యనారాయణశర్మ, శివాలయ ప్రధానార్చకులు గౌరిభట్ల నరసింహరాములుశర్మ, అర్చక బృందం, రుత్వికులు నిర్వహించగా. ఆలయ అనువంశీఖ ధర్మకర్త బీ నరసింహమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనృసింహుడి ఘనంగా నిత్యపూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం నిత్యపూజా కైంకర్యాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన వేదపండితులు నిజాభిషేకం, నిత్యార్చనలు జరిపి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను నిర్వహించారు. సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, స్వామి, అమ్మవార్లకు సహస్రనామార్చనలు జరిపిన పూజారులు రాత్రి నివేదనలు, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వార బంధనం చేశారు. ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.24,19,119 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-02-21T00:22:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising