సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలి
ABN, First Publish Date - 2023-04-03T00:39:08+05:30
బహుజన విప్లవవీరుడు సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పలువురు నివాళులర్పించారు
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్: బహుజన విప్లవవీరుడు సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలని కోరారు.
- కలెక్టరేట్‌లో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మొగదాల లక్ష్మణ్‌గౌడ్, పెనపమాడ్ మండల అధ్యక్షుడు పొడిశెట్టి సైదులుగౌడ్, ప్రకాష్‌గౌడ్, ముత్తిరాజుగౌడ్ పాల్గొన్నారు.
- బహుజనులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా 12కులాలను ఏకం చేసి 32కోటలను జయించి బహుజనులను రాజులను చేసిన మహోన్నత వ్యక్తి పాపన్న అని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు రాంబాబు గౌడ్ అన్నారు. గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెంలో నిర్వహించిన పాపన్న వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. పాపన్నగౌడ్ యువతకు ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో గుండు వీరబాబుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, తుమ్మల సైదయ్య గౌడ్, మామిడి వెంకటేశ్వర్లుగౌడ్, ఆనంద్‌గౌడ్, రామనాథంగౌడ్‌పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T00:39:08+05:30 IST