ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎంఆర్‌కు కలిసొచ్చిన సంక్రాంతి

ABN, First Publish Date - 2023-01-15T00:30:37+05:30

సంక్రాంతి పండుగ టోల్‌గేట్‌ నిర్వాహకులకు కలిసొచ్చింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రయాణికులతో వారికి లాభాల పంట పండింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌ జనవరి 13: సంక్రాంతి పండుగ టోల్‌గేట్‌ నిర్వాహకులకు కలిసొచ్చింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రయాణికులతో వారికి లాభాల పంట పండింది. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు నిర్వహణ సంస్థ జీఎంఆర్‌కు లక్షల ఆధాయం సమకూరింది. 12, 13 తేదిలలో పంతంగి టోల్‌గేటు నుంచి 1.24లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. 12వ తేదిన 56వేల 595 వాహనాలు రాకపోకలు సాగించాగా 12తేదిన 67వేల 577 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఇందులో కార్లు 96వేల 405 వాహనాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు 3151, ప్రైవేటు బస్సులు 9819, ఇతర వాహనాలు 14,797 వాహనాలు పంతంగి టోల్‌గేటు నుండి రాకపోకలు సాగించాయి. రెండు రోజుల్లోనే దాదాపు రూ 2కోట్ల ఆదాయం వచ్చింది. కాగా శనివారం భోగి పండుగ కావడంతో జాతీయరహదారిపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. సాదారణ రోజులలో 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పంతగి టోల్‌గేటు నుండి శనివారం 18 వేల వాహనాలు మాత్రేమే రాకపోకలు సాగించినట్టు సమాచారం. ట్రాఫిక్‌ నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలపై ప్రయాణికులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-15T00:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising