ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్యాగాలు ఒకరివి.. బోగాలు మరొకరివి

ABN, First Publish Date - 2023-06-03T00:33:28+05:30

ప్రత్యేక రాష్ట్రంలో త్యాగాలు ఒకరు చేస్తే బోగాలు మరొకరు అనుభవిస్తున్నారని సీపీఐ(ఎంఎ ల్‌) ప్రజాపంథా డివిజన కార్యద ర్శి కొత్తపల్లి రేణుక ఆరోపించారు.

ప్రజాపంథా నాయకులను పోలీస్‌స్టేషనకు తరలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటఅర్బన, జూన 2 : ప్రత్యేక రాష్ట్రంలో త్యాగాలు ఒకరు చేస్తే బోగాలు మరొకరు అనుభవిస్తున్నారని సీపీఐ(ఎంఎ ల్‌) ప్రజాపంథా డివిజన కార్యద ర్శి కొత్తపల్లి రేణుక ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దీక్షా దివస్‌ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకా ల కోసం ఎందరో ప్రాణాత్యాగా లు చేసి, ఎన్నో పోరాటాల ద్వారా సాధించిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కుటుంబపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను కనీసం ప్రగతిభవన మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా ఏకపక్ష పరిపాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే అవకాశం లేకుండా అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ రేషనకార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇంటి స్థలం ఉన్న వారికి రూ. 10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా దీక్షా దివ్‌సలో పా ల్గొన్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీ్‌సస్టేషనకు తరలించారు. కార్యక్రమంలో నాయకులు ఎర్ర అఖిల్‌కుమార్‌, భూక్యా రాంజీ, చంద్రకళ, రేణుక, వాజీద్‌, జయమ్మ, సింహాద్రి, శైలజ, రాజేశ్వరీ, లింగ మ్మ, బావ్‌సింగ్‌, రమణ, శోభ, పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising