ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీ బస్టాండ్‌ కంపుకొడుతోంది

ABN, First Publish Date - 2023-08-01T23:57:04+05:30

ప్రయాణికులతో నిత్యం ర ద్దీగా ఉండే కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ కంపుకొడుతోంది.

కొండమల్లేపల్లి బస్టాండ్‌

నిత్యం రద్దీగా కొండమల్లేపల్లి బస్టాండ్‌

మరమ్మతులకు గురైన బోరు

మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

కొండమల్లేపల్లి,ఆగస్టు 1: ప్రయాణికులతో నిత్యం ర ద్దీగా ఉండే కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌ కంపుకొడుతోంది.బోరు మరమ్మతులకుగురై బస్టాండ్‌లో నీటి సరఫరా నిలిచిపోవడంతో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక దుర్వాసనతో ప్రయాణికులు ముక్కు మూసకుంటున్నారు. ఈ బస్టాండులో మొత్తం 15షాపులు అద్దెకు ఇచ్చారు. వీటి ఆదాయం నెలకు రూ.2లక్షలకు పైగా వస్తుంది. ఇంత ఆదాయం ఉన్నా బస్టాండుకు వచ్చే ప్రయాణికులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్లను ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొండమల్లేపల్లి బస్టాండ్‌లోని మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా చేసే బోరు మరమ్మతులకు గురికావడంతో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది చుట్టుపక్కల గల ఇళ్ల నుంచి నుంచి అడపాదడఫా నీళ్లు తెస్తున్నా అవి సరిపోవడం లేదు. అదేవిధంగా బస్టాండులో ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లో ఫ్లోరిన్‌ వాటర్‌ నింపడంతో ప్రయాణికు లు తాగలేకపోతున్నారు. బయటషాపుల్లో నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వెంటనే మరమ్మతులకు గురైన బోరును బాగు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్‌ రాజీవ్‌ ప్రేమ్‌కుమార్‌ వివరణ కోరగా మోటారు పంపు సెట్టు రిపేరు కావడంతో వాటర్‌ సమస్య నెలకొందన్నారు.ముందు ఇలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

దుర్వాసన భరించలేకపోతున్నాం

గతంలో కొండమల్లేపల్లి బస్టాండులో మూత్రశాలలు చాలా శుభ్రంగా ఉండేవి. కానీ ప్రస్తుతం నిర్వహణ లోపంతో భయంకరమై న దుర్వాసన వస్తోంది. దీంతో సీజనల్‌ వ్యాధులు ప్రబ లే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు తగిన చొరవ తీసుకొని శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.

- రమావత్‌ కృష్ణ, గన్యనాయక్‌తండా, ప్రయాణికుడు

నీటి సమస్య ఉంది

ఆర్టీసీ బస్టాండులో మరుగుదొడ్లకు నీ టి సరఫరా చేసే బోరు మరమ్మతులకు గురైంది. నెల రోజులుగా నీటి సరఫరా లేదు. అడపాదడఫా చుట్టు పక్కల ఇళ్ల నుంచి నీళ్లు తీసుకుటు న్నాం. కానీ అవి సరిపోకపోవడంతో సమస్య తలెత్తింది. కాంట్రాక్టర్‌కు తెలిసినప్పటికీ స్పందన లేదు.

- వెంకటయ్య, మూత్రశాల నిర్వాహకుడు.

Updated Date - 2023-08-01T23:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising