షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సు దగ్ధం
ABN, First Publish Date - 2023-03-30T00:25:27+05:30
విద్యుత షార్ట్‌సర్క్యూట్‌తో ఆర్టీసీ ఇంద్ర బస్సు దగ్ధమైంది. ఈ సంఘటన జిల్లాకేంద్రంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన ఇంద్ర ఏసీ బస్సు టీఎ్‌స04జడ్ 0198 ఖమ్మం నుంచి 18 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బుధవారం తెల్లవారుజామున బయలుదేరింది.
సూర్యాపేటక్రైం, మార్చి 29 : విద్యుత షార్ట్‌సర్క్యూట్‌తో ఆర్టీసీ ఇంద్ర బస్సు దగ్ధమైంది. ఈ సంఘటన జిల్లాకేంద్రంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన ఇంద్ర ఏసీ బస్సు టీఎ్‌స04జడ్ 0198 ఖమ్మం నుంచి 18 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బుధవారం తెల్లవారుజామున బయలుదేరింది. సూర్యాపేట జిల్లా పరిధిలోని చివ్వెంల వద్దకు రాగానే బస్సు మరమ్మతుకు గురైంది. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపి ఖమ్మం ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈ లోపు బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు పంపించారు. ఖమ్మం డిపో నుంచి ఆర్టీసీ మెకానిక్‌లు బస్సు వద్దకు వచ్చి పరిశీలించారు. అక్కడ మరమ్మతు చేయడానికి వీలులేకపోవడంతో సూర్యాపేట డిపోలో మరమ్మతు చేసేందుకు బస్సును తీసుకుని సూర్యాపేటకు బయలుదేరారు. సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే బస్సులో ఏర్పాటుచేసిన ఎలక్ర్టికల్ ఫ్యూజుల వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు లేచాయి. ఆ మంటలు వేగంగా బస్సు మొత్తాన్ని వ్యాపించాయి. అగ్నిమాపక కేంద్రం వారికి సమాచారమివ్వగా వారు వచ్చే సమయానికే బస్సు పూర్తిగా దగ్దమైంది. సుమారు రూ.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-03-30T00:25:27+05:30 IST