ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైనమెంట్‌ మార్చాలి

ABN, First Publish Date - 2023-03-27T23:59:05+05:30

రీజనల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైనమెంట్‌ మార్చాలని చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం ప్రాంత రైతులు అధికారులను సోమవారం అడ్డుకున్నారు.

ఆందోళన చేస్తున్న భాదిత రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చౌటుప్పల్‌ రూరల్‌ మార్చి 27: రీజనల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైనమెంట్‌ మార్చాలని చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం ప్రాంత రైతులు అధికారులను సోమవారం అడ్డుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం చేపట్టే ఎస్‌.లింగోటం పరిధిలోని సూపర్‌ గ్యాస్‌ కంపెనీ సమీపంలో సర్వేకు రెవెన్యూ, సర్వే అధికారులు వచ్చారు. సమాచారం తెలుసుకున్న నేలపట్ల, జైకేసారం, కుంట్లగూడెం, మందోళ్లగూడెం, ఎస్‌.లింగోటం, వలిగొండ మండలం వర్కట్‌పల్లి, గోకారం గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున్న అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి, ఆర్‌ఆర్‌ఆర్‌ రోడ్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైనమెంట్‌ మార్చాలని, రహదారి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. స్పష్టమైన హామీఇచ్చిన తర్వాతే సర్వే నిర్వహించాలని రైతులు డిమాండ్‌ చేస్తూ అడ్డుకున్నారు. తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, సర్వేయర్‌ వెంకటయ్య, మురళీధర్‌రావును ఘెరావ్‌ చేశారు. ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, బాధిత రైతులతో మాట్లాడారు. అయినా రైతులు వినకపోవడంతో సర్వే నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగారు.

Updated Date - 2023-03-27T23:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising