ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చాలి

ABN, First Publish Date - 2023-03-15T23:42:30+05:30

రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ ఆర్‌)కు అవసరానికి మించి భూమి సేకరిస్తున్నారని, అలైన్‌మెంట్‌ను మార్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో సమావేశమైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

యాదాద్రి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ ఆర్‌)కు అవసరానికి మించి భూమి సేకరిస్తున్నారని, అలైన్‌మెంట్‌ను మార్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. బుధ వారం ఢిల్లీలో జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (ఎన్‌హెచ్‌ ఏఐ) చైర్మన్‌ సంతోష్‌కుమార్‌యాదవ్‌తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ అయ్యారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంతో పేదలకు అన్యాయం జరు గుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అవసరానికి మించి భూసేకరణ చేపడు తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించు కోవడం లేదని, ప్రైవేట్‌ భూముల్లో నుంచి కాకుండా, ప్రభుత్వ భూము ల్లో నుంచి వెళ్లేలా అలైన్‌మెంట్‌ మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చి ప్రజల ఇబ్బందులను గుర్తించాల న్నా రు. ఆర్‌ఆర్‌ఆర్‌ డిజైన్‌ ఇప్పటికీ అప్రూవల్‌ కాలేదని, రాష్ట్ర ప్రభు త్వం ఇవ్వాల్సిన రూ.500కోట్లు చెల్లించలేదని, అంతలోనే చాలామంది రైతు లను రోడ్డున పడేశారన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌ సమావేశా ల్లోనూ ప్రస్తావించానన్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ సా నుకూలంగా స్పందించారని, అలైన్‌మెంట్‌ మార్పునకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఎంపీ వెంకటరెడ్డి ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

Updated Date - 2023-03-15T23:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising