దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి
ABN, First Publish Date - 2023-08-22T23:48:36+05:30
దివ్యాంగులకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ డిమాండ్ చేశారు.
ఆలేరు, ఆగస్టు 22: దివ్యాంగులకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరులోని వైఎ్‌సఎన గార్డెనలో వికలాంగుల హక్కుల ఐక్యవేదిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు బడ్జెట్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. వేదిక జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రకాశ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శులు వనం ఉపేందర్, ఎక్బాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, ఆలేరు మాజీ సర్పంచ ఆకవరం మోహన రావు, రైతు సంఘం నాయకులు గణగాని మల్లేశ, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, డీవెఎ్‌ఫఐ నాయకులు చెన్న రాజేశ, గణేశ, బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2023-08-22T23:48:36+05:30 IST