ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వర్షం.. హర్షం

ABN, First Publish Date - 2023-07-21T00:35:32+05:30

ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న ముసురుతో పంటలకు జీవం వచ్చింది.

మూసీ రెండు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

ఉమ్మడి జిల్లా అంతటా ముసురు

జీవం పోసుకున్న పత్తి చేలు

ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన ప్రారంభం నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న ముసురుతో పంటలకు జీవం వచ్చింది. ప్రధానంగా పత్తి పంట కళకళలాడుతోంది. దీంతో రైతుల మోముపై ఆనందం కన్పిస్తోంది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి- నల్లగొండ)

మూడురోజులుగా ముసురు కురుస్తుండటంతో పంటలకు ప్రాణం వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సీజనలో సుమారు 18.50లక్షల ఎకరాల వరకు వరి, పత్తి పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగానే మూడు జిల్లాల్లో 9.50లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగైంది. ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయకుండానే ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వానాకాలం పంటలు గట్టెక్కుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అంతటా ముసురు

నల్లగొండ జిల్లా అనుముల మండలంలో అత్యధికంగా 33.3మి.మీ వర్షం కురిసింది. దామరచర్లలో 31.8మి.మీ, త్రిపురారంలో 31, నిడమనూరులో 28.8, నకిరేకల్‌లో 28.8, చింతపల్లిలో 27.0, మర్రిగూడలో 26, నాంపల్లిలో 22.5, గుర్రంపోడు, శాలిగౌరారంలో 21మి.మీ వర్షం కురిసింది. యాదాద్రి జిల్లాలో బొమ్మలరామారం మండలంలో అత్యధికంగా 50.8 మి.మీ, యాదగిరిగుట్టలో 40.8మి.మీ, పోచంపల్లిలో 30, భువ నగిరిలో 37, ఆలేరులో 34.8, బీబీనగర్‌లో 33.3మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా మోతె మండలంలో 28.3మి.మీ, మద్దిరాలలో 23.3మి.మీ వర్షపాతం నమోదైంది. ముసురు కురుస్తుండటంతో మెట్ట పంటల వరకు గట్టెక్కగా, వరి సేద్యం ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎగువ నుంచి వరద లేకపోవడంతో ఇప్పట్లో ప్రాజెక్టు నిండే అవకాశం లేదు. దీంతో ఆయకట్టు కింద ఇప్పట్లో వరి సాగయ్యే అవకాశాలు లేవు. అయితే ఆయకట్టులో బోర్లు వేసిన రైతులు నాట్లు వేసుకోనున్నారు. ప్రస్తుతం పత్తి 45 రోజుల మొలక దశలో ఉన్న పత్తి చేలు తాజాగా, కురిసిన వర్షాలతో ఏపుగా ఎదగనున్నాయి. అదేవిధంగా వర్షాలకు నూతనకల్‌ మండలంలోని ఎడవెల్లి కత్వా అలుగుపోస్తు ంది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మూసీకి భారీగా వరద

సూర్యాపేట రూరల్‌ : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్‌ అధికారులు గురువారం సాయంత్రం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 645అడుగులు కాగా, ప్రస్తుతం 642.60అడుగుల మేర నీరు చేరింది. 4.46టీఎంసీలకుగాను ప్రస్తుతం 3.84టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాత్రికి పెద్దమొత్తంలో వరద వచ్చే అవకాశం ఉం డడంతో రెండుగేట్లను 1.5మీటర్లు మేర ఎత్తి దిగువకు 1,900క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 2,663.13క్యూసెక్కుల ఇనఫ్లో ఉంది. ప్రాజెక్టుకు మొత్తం 12 గేట్లు ఉం డగా, రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్న అధికారులు హైదరాబాద్‌ నుంచి వరద పెరిగితే మరికొన్ని గేట్లను ఏ క్షణానైనా ఎత్తే అవకాశం ఉంది. మూసీ ప్రాజెక్టుకు వరద నీరు నిరంతరయంగా వస్తుండడంతో మూడు రోజుల క్రితమే ప్రాజెక్ట్‌ అధికారులు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఎడమ కాల్వకు 142క్యూసెక్కుల నీటిని, కుడి కాల్వకు 95క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వానాకాలం సీజనలో వరి సేద్యం కోసం నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని 33వేల ఎకరాలకు ప్రాజెక్టు నుంచి ఈ నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన మొదలయ్యాక 50రోజుల తర్వాత వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాజెక్టులో కూడా పెద్దగా నీటి నిల్వలు లేవు. దీంతో ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయడంలేదు. అయితే ఒక్క మూసీ ప్రాజెక్టుకు మాత్రం వరద పోటెత్తుతుండడంతో కాల్వలకు నీటిని విడుదల చేసిన అధికారులు, ఆ డ్యాం భద్రత దృష్ట్యా రెండు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ పెరగనున్న నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో గ్రామాల్లో డప్పు చాటింపు చేసి పశువుల కాపర్లను, చేపల వేటకు వెళ్లే వారిని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-07-21T00:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising