పొంచి ఉన్న విద్యుత గండాలు
ABN, First Publish Date - 2023-09-22T00:31:57+05:30
మండలంలో పలు విద్యుత ట్రాన్సఫార్మ ర్లకు ఫెన్సింగ్ లేనందున ప్రమాదం పొంచి ఉంది.
మఠంపల్లి, సెప్టెంబరు 21: మండలంలో పలు విద్యుత ట్రాన్సఫార్మ ర్లకు ఫెన్సింగ్ లేనందున ప్రమాదం పొంచి ఉంది. మఠంపల్లి మండల కేంద్రంలో తీగల్ చెర్వు సమీపంలో 100కేవీ ట్రాన్సపార్మర్ తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడంతో ప్రజలు, మూగజీవాలకు ప్రమాదం పొంచి ఉంది. మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స పాఠశాల సమీ పంలో ఉన్న విద్యుత స్తంభం శిధిలావస్థకు చేరడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాం దోళనతో ఉన్నారు. చౌటపల్లి, కృష్ణతండా, తుమ్మల తండాలకు వెళ్లే ప్రధాన రహదారి కూడలిలో ఏర్పాటు చేసి విద్యుత స్తంభం దిమ్మె శిథిలావస్థకు చేరింది. ఇది ఏ సమయంలో కూలి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనతో ఉన్నారు. చౌటపల్లి గ్రామ శివారులో 32కేవీ విద్యుత లైన, 11కేవీ విద్యుత లైన మీటర్ దూరంలో ఉన్నాయి. ఈదురుగాలలు బలంగా వీచే సమయంలో తీగలు రాసుకుని ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయపడుతు న్నారు. ట్రాన్సఫార్మర్లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, ఎక్కువ ఎత్తులో దిమ్మెలను నిర్మించి ట్రాన్సఫార్లను, శిథిలావస్థలో ఉన్న విద్యుత స్తంభాలను మార్చి సమస్యలను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
మండల కేంద్రంలోని చౌటపల్లి గ్రామశివారులో, సెయింట్ ఆన్స పాఠశాల సమీపంలో, మఠంపల్లిలోని ప్రధాన రహదారిలో విద్యుత స్తంబాలు ప్రమాదకరంగా ఉన్నాయి. తండాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. వీటితో ప్రజలు, మూగ జీవాలు ప్రమాదాల బారినపడి అవకాశం ఉంది. ఈబవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదు.
మాలోతు సక్రునాయక్
ప్రమాదకర విద్యుత స్తంభాలను మార్చుతాం
ప్రమాదకరంగా ఉన్న విద్యుత స్తంభాలను త్వరలో మార్చుతాం. చౌటపల్లి గ్రామ శివారులో 32కేవీ విద్యుత లైన, 11కేవీ విద్యుత లైన పక్కపక్కనే ప్రమాదకరంగా ఉన్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. మండలంలో శిథిలావస్థకు చేరిన విద్యుత స్తంభాలు, ఫెన్సింగ్ లేని ట్రాన్సఫార్మర్లు, తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్న విద్యుత తీగల విషయాన్ని నా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తా.
- హరీష్‌రెడ్డి, విద్యుత ఏఈ, మఠంపల్లి
పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-22T00:31:57+05:30 IST