ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆధ్యాత్మికం, సంప్రదాయాల్లో మన దేశానిది ప్రథమస్థానం

ABN, First Publish Date - 2023-09-20T00:23:41+05:30

ఆధ్యాత్మికం, సంస్కృతి, సంప్రదాయాల్లో మన దేశం ప్రథమస్థానంలో ఉందని ఎమ్మెల్సీ, మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవి అన్నారు. మంగళవారం దేవరకొండలో పీవీ సన్నిహితుడు దివంగత నెమికంటి సోమన్న రాసిన ‘శ్రీగజానన విజయం’ పుస్తకాన్ని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌తో కలిసి ఆవిష్కరించారు.

‘శ్రీగజానన విజయం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే రవీంద్ర

ఎమ్మెల్సీ వాణిదేవి

దేవరకొండ, సెప్టెంబరు 19: ఆధ్యాత్మికం, సంస్కృతి, సంప్రదాయాల్లో మన దేశం ప్రథమస్థానంలో ఉందని ఎమ్మెల్సీ, మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవి అన్నారు. మంగళవారం దేవరకొండలో పీవీ సన్నిహితుడు దివంగత నెమికంటి సోమన్న రాసిన ‘శ్రీగజానన విజయం’ పుస్తకాన్ని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మరాఠి భాషలో ఉన్న పుస్తకాన్ని నేమికంటి సోమన్న తెలుగులో అనువాదం చేయగా, ఆ యన కుమారుడు నేమికంటి గౌరిశంకర్‌, రమాశంకర్‌, ఉమాశంకర్‌, అంబశంకర్‌ దాన్ని విడుదల చేయడం అభినందనీయమన్నారు. కవు లు, కళాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. మహిళ లు చదువులో రాణించి అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, నీల పాండరయ్య, పానగంటి మల్లయ్య, పొలిశెట్టి భిక్షపతి, నీల బుచ్చయ్య, ఉమామహేశ్వర్‌, శేఖర్‌, కోటయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising