ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు రాజ్యాంగ విరుద్ధం

ABN, First Publish Date - 2023-06-03T00:36:24+05:30

రీజనల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతూ ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తున్న రైతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. శుక్రవారం ఆయన సబ్‌జైలులో ఉన్న రైతులను పరామర్శించేందుకు ములాఖత్‌కోసం వెళ్లగా, జైలు సిబ్బంది లోపలికి అనుమతించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌

భువనగిరి రూరల్‌, జూన్‌ 2: రీజనల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతూ ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తున్న రైతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. శుక్రవారం ఆయన సబ్‌జైలులో ఉన్న రైతులను పరామర్శించేందుకు ములాఖత్‌కోసం వెళ్లగా, జైలు సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన 40 నిమిషాల పాటు ఆయన స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సబ్‌ జైలు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మాట్లాడిన ప్రతీసారి తమది రైతుల ప్రభుత్వం అని చెబుతూ అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పాత అలైన్‌మెంట్‌ ప్రకారం బీఆర్‌ఎస్‌ నేతలు భూములు కోల్పోతున్నారని, అందుకే కొత్త అలైన్‌మెంట్‌ ప్రతిపాదించారని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాయ దశరథ, నాయకులు పడమటి జగన్మోహన్‌రెడ్డి, గూడూరు నరోత్తమ్‌రెడ్డి, సూదగాని హరిశంకర్‌గౌడ్‌, పడాల శ్రీనివాస్‌, సురకంటి రంగారెడ్డి, చిక్క కృష్ణ, వల్దాస్‌ రాజు కాలభైరవ, డీఎల్‌ఎన్‌గౌడ్‌, క్యాసాని శ్రీనివాస్‌, ఆర్‌ శ్రీశైలం, నల్లమాస రాజు, తదితరులు పాల్గొన్నారు.

అవినీతి పాలనను బొందపెడితేనే అభివృద్ధి

బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనను బొందపెడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని నర్సయ్యగౌడ్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా భువనగిరిలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళి అర్పించి మాట్లాడారు. బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌ పోరాట ఫలితంగానే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.

Updated Date - 2023-06-03T00:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising