ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమయం లేదు మిత్రమా

ABN, First Publish Date - 2023-05-20T01:02:57+05:30

సమయం లేదు మిత్రమా, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలంటూ నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

హుజూర్‌నగర్‌ సభలో బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

అప్రతిష్ఠపాలు చేసేందుకు కొందరి కుట్ర

అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ / కోదాడ, మే 19 : సమయం లేదు మిత్రమా, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలంటూ నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే, సతీమణి పద్మావతిరెడ్డితో కలిసి కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాల్లో శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కొంతమంది వ్యక్తులు తనను, తన సతీమణి పద్మావతిని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఆ కుట్రలను కాంగ్రెస్‌ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. తమపై సోషల్‌మీడియాలో ఎన్ని ట్రోల్‌ చేసినా ఏమీ చేయలేరని, కాంగ్రెస్‌ కార్యకర్తలే తనకు బలమన్నారు. పార్టీలో ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేయిస్తున్నారన్నారు. పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ చరిత్రను తిరగరాయాలన్నారు. కార్యకర్తలు కోరుకుంటేనే పోటీ చేస్తానని, నాకు పదవులపై కోరిక లేదన్నారు. పద్మావతి, తాను మరో పదిహేనేళ్లు రాజకీయాలలో ఉంటామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైనింగ్‌తో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో వైన్‌ షాపు నుంచి రూ.4 లక్షలు కమీషన్లు తీసుకుని, ఇష్టం వచ్చినట్లు మద్యం రేట్లు పెంచుకోవాలని బీఆర్‌ఎస్‌ నేత చెప్పడం సిగ్గుచేటన్నారు. కోదాడలో అధికార పార్టీ నేతలు వాటితో పాటు మట్టి ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదన్నారు. అంతేకాక పోలీసులు, ఇతర శాఖ అధికారులు, విపక్షాల రాజకీయనాయకులపై కక్షసాధింపు చర్యలు ఎన్నికైన ప్రజాప్రతినిధుల కను సన్నలలో చేరుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు వ్యాపారులు, నేతలు ట్యాక్స్‌లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగేది అభివృద్ది కాదని, లూటీ, కమీషన్‌, దోపిడీ, 10 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల మెజార్టీతో గెలిపించాలన్నారు. మెజార్టీ ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

ఈ ఏడాదితో ముప్పైఏళ్ల రాజకీయ జీవితం పూర్తవుతుందన్నారు. తన రాజకీయాలలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా పనిచేశానన్నారు. వందరోజుల్లో ఎన్నికలు ఉన్నందున సమయంలేదని, కార్యకర్తలు బూత్‌ల వారీగా కమిటీలు వేసుకోవాలన్నారు. వందమందికి ఒక సమన్వయకర్తను ఏర్పాటుచేసుకోవాలన్నారు. తాను కూడా వందమందికి సమన్వయకర్తగా వ్యవహరిస్తానన్నారు. కార్యకర్తలు, నాయకులు, కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి 50 వేల మెజార్టీతో పార్టీ గెలుస్తుందని పద్మావతిరెడ్డి అన్నారు. ఆయా సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నిరంజన్‌, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ లక్ష్మీనారాయణరెడ్డి, ఆకుల లలిత, వంగవీటి రామారావు, పారా సీతయ్య, కందుల కోటేశ్వరరావు, గంధం యాదగిరి, షాబుద్దీన, ఆవుదొడ్డి ధనమూర్తి, రజనీకాంత, వరప్రసాద్‌రెడ్డి, బాజాన, నగే్‌షముదిరాజ్‌, తన్నీరు మల్లికార్జున్‌, యరగాని నాగన్న,దొంగరి వెంకటేశ్వర్లు, సాముల శివారెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, కొట్టే సైదేశ్వరరావు, గోపాల్‌నాయక్‌, వీరారెడ్డి, మంజూనాయక్‌, శ్రావణ్‌, అంజన్‌రెడ్డి, సుబ్బారావు, సంపత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జెయిలు, బెంజిమెన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-20T01:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising