ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేత సమస్యలపై సంఘటితం కావాలి

ABN, First Publish Date - 2023-02-21T00:27:21+05:30

చేనేత రంగంలోని కార్మికులు, పారిశ్రామికులు, వస్త్ర వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం సంఘటితం కావాలని ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్‌ పిలుపునిచ్చారు.

ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదానపోచంపల్లి, ఫిబ్రవరి 20 : చేనేత రంగంలోని కార్మికులు, పారిశ్రామికులు, వస్త్ర వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం సంఘటితం కావాలని ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్‌ పిలుపునిచ్చారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా భూదానపోచంపల్లి పట్టణంలోని పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన రజతోత్సవ భవనంలో చేనేతల పరస్పర పరిచయ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. మార్చి 5న హైదరాబాద్‌లోని వనస్థలిపురంలోని కర్నాటి గార్డెన్సలో జరిగే తెలంగాణ రాష్ట్ర సమస్త చేనేత పరస్పర పరిచయ ఆత్మీయ సమ్మేళనానికి అంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమస్త చేనేత సమస్యలపై చర్చించి తీర్మానాలను తయారుచేసి ఆయా ప్రభుత్వాలకు నివేదిక సమర్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఫెడరేషన నాయకులు వేముల బాలరాజు,వనం శాంతికుమారి, బోగ లక్ష్మయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, వనం పరమేష్‌, రాజోలు జ్ఞానేశ్వర్‌, గవ్వల శంకర్‌, పాశికంటి లక్ష్మీనర్సయ్య, కవి రాపోలు జగన, స్థానిక నాయకులు తడక వెంకటేష్‌, కర్నాటి పాండు, తడక రమేష్‌, భారత లవకుమార్‌, భారత వాసుదేవ్‌, చింతకింది రమేష్‌, చిక్క కృష్ణ, ఎన్నం శివకుమార్‌, సీత దామోదర్‌, మెరుగు శశికళ, దోర్నాల శేషగిరి, అంకం మురళి, భిక్షపతి, రఘు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising