యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్
ABN, First Publish Date - 2023-07-21T01:14:21+05:30
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. గురువారం భువనగిరి శివారులోని రాయిగిరిలోగల యాదాద్రి రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు త్వరలోనే మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) రైలు సదుపాయంకోసం 3వ లైన్ ట్రాక్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎంఎంటీఎస్ ఏర్పాటుతో సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి సుమారు 30 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉందన్నారు.
యాదాద్రి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ఎస్‌సీఆర్ జీఎం అరుణ్‌కుమార్ జైన్
భువనగిరి రూరల్, జూలై 20: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్ రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. గురువారం భువనగిరి శివారులోని రాయిగిరిలోగల యాదాద్రి రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు త్వరలోనే మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) రైలు సదుపాయంకోసం 3వ లైన్ ట్రాక్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎంఎంటీఎస్ ఏర్పాటుతో సికింద్రాబాద్ నుంచి యాదాద్రికి సుమారు 30 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా యాదాద్రి రైల్వేస్టేషన్‌లో రూ.4కోట్లతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను, ప్యాసింజర్ షెడ్లు, టాయిలెట్స్, తదితర పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్లు ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్లు అభయ్‌కుమార్ గుప్తా, బీకే గుప్తా, బి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T01:14:21+05:30 IST